lingeswara

ఆలయం గురుంచి

మా గోనెపాడు గ్రామము కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో ఎన్ హెచ్ 165 జాతీయ రహదారిని ఆనుకొని యున్నది. ఈ గోనెపాడు గ్రామము సుమారు 200 సం॥ల క్రిందట ఒక అగ్రహారముగా ఏర్పడి యున్నది. బృహస్పతి, శుక్రాచార్యది గురొత్తముల మేలిమి వంశాకుములైన సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబముల వారి నివాస స్థానమై ఉండి  యున్నది. కాల క్రమేణా ఆ సనాతన ఆచారములు, సాంప్రదాయములు ఈ గ్రామములోని అన్ని వర్గముల వారికీ సంక్రమించి గ్రామమంతా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ప్రకాశించు చున్నది.

ప్రస్తుతము ఈ గ్రామములో విభిన్న మతములు వారు నివసించు యున్నారు. అయినప్పటికీ వీరు అనాదిగా ఆ బ్రాహ్మణులచే ప్రతిష్ఠించబడిన సనాతన ఆచార వ్యవహారములు. సాంప్రదాయములు ఇప్పటికి కొనసాగించుచునే యున్నారు. గ్రామములో ప్రజలందరూ కూడా భక్తి భావముతో ధర్మ మార్గాని వీడక తమ జీవన యాత్ర కొనసాగించు చున్నారు. గ్రామమునుండి వృత్తి రీత్యా బయటకు వెళ్ళిన వారు కూడా గ్రామముతో ఆధ్యాత్మిక అభివృద్ధికి దైవ కార్యక్రమము భూరి విరాళములు అందచేస్తూ తమ మాతృ భూమిపై మమకారాన్ని మరువక కొనసాగించు చున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా గ్రామములోని యువకులందరూ ఏకమై గ్రామములో కొలువై యున్న శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవములను అంగరంగ వైభవముగా నిర్వహించు చున్నారు. ఆ తల్లి అనుగ్రహమో, గ్రామస్థుల మహద్భాగ్యమో గానీ ఈ దుర్గమ్మకే ఆది దేవుడైన ఆ మహా శివుడు కూడా మా గ్రామమందే కొలువై మమ్ము సదా రక్షించుటకు ఈ మధ్యకాలములో ఒక మహాద్భుత మహిమ గ్రామములో చోటు చేసుకున్నది.

కొల్లేరు సరస్సుకు అనుకొని యున్న మా గోనెపాడు గ్రామము తరచుగా వరదలకు గురి అగుచున్నది. ఇట్టి పరిస్థితులలో గత సంవత్సరం వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత మా గోనెపాడు గ్రామనికి వాయువ్య దిశలో ఒక అద్భుత మహిమ నెలకొన్నది. అదేమనగా గ్రామ వాయువ్య సరిహద్దులో గల ముళ్ల పొదల క్రింద భూమిలో నుండి ది. 15-11-2020వ తేదీన ఆ మహా శివుని లింగము స్వయంభువుగా వెలువడి రోజు రోజుకూ పైకి లేస్తూ గ్రామస్థుల మరియు పరిసర గ్రామాల ప్రజలను సంభ్రమాశ్చర్యాల మధ్య పైకి ఉబికినది. ఈ మహత్తర మహిమను గాంచిన యావత్ ప్రజానీకం భక్తి పారవశ్యంలో మునిగి తేలినది.

ఈ మహద్భాగ్యాన్ని గమనించిన గ్రామస్థులు ఆగమ పండితులను పిలిపించగా వారు విచారించి ఈ స్వామి పేరు “గంగా పార్వతీ సమేత జల లింగేశ్వర స్వామి” గా నిర్ధారించినారు.